Payments రికార్డు స్థాయిలో చెల్లింపులు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:16 AM
Record-High Payments జిల్లాలో ఖరీఫ్ ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో చెల్లింపులు చేస్తోంది. గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.
ఆనందంలో రైతులు
పార్వతీపురం, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో చెల్లింపులు చేస్తోంది. గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 19,912 మంది రైతుల నుంచి లక్షా 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వారికి సుమారు రూ.308 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే 19,396 మందికి రూ. 289.64 కోట్లు చెల్లింపులు చేశారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.‘ ధాన్యం కొనుగోలు వేగంగా చేపడుతున్నాం. గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం.. ఇప్పటివరకు 1:2 పద్ధతిలో మిల్లర్లకు ధాన్యం అందిస్తున్నాం. 1:3కి సంబంధించి ఇంకా ఆదేశాలు రాలేదు. ’ అని సివిల్ సప్లైస్ శాఖ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.