Share News

Recognition of tenant farmers కౌలు రైతులకు గుర్తింపు

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:51 PM

Recognition of tenant farmers కౌలు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. భూములున్న రైతులతో సమానంగా వారికి కూడా ప్రయోజనాలు అందేలా చర్యలు ప్రారంభించారు. వారికి గుర్తింపు సంఖ్యతో కార్డు జారీ చేయనున్నారు. తుదిరూపు దాల్చిన ఈప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి కౌలు రైతులకు తీసికబురు చెప్పేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.

Recognition of tenant farmers కౌలు రైతులకు గుర్తింపు

కౌలు రైతులకు గుర్తింపు

ఓ నెంబర్‌తో కార్డు జారీకి ప్రభుత్వం చర్యలు

భూములున్న రైతులతో సమానంగా రాయితీ పథకాలు

త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే అవకాశం

మెంటాడ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి):

కౌలు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. భూములున్న రైతులతో సమానంగా వారికి కూడా ప్రయోజనాలు అందేలా చర్యలు ప్రారంభించారు. వారికి గుర్తింపు సంఖ్యతో కార్డు జారీ చేయనున్నారు. తుదిరూపు దాల్చిన ఈప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి కౌలు రైతులకు తీసికబురు చెప్పేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.

కౌలు రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం పరంగా పెద్దగా ప్రయోజనాలు లేవు. రాయితీ పథకాలు వీరికి వర్తించడం లేదు. భూములు కౌలుకిచ్చిన అసలు రైతులతో మౌఖికంగా కుదిరే అనధికారిక ఒప్పందం ప్రకారమే వీరు నడుచుకోవాల్సి ఉంటోంది. కౌలు భూములపై ప్రభుత్వ ప్రయోజనాలన్నీ అసలు రైతులకే వర్తిస్తున్నాయి. రాయితీ పథకాలన్నీ వారికే అందుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో జరిగే పంట నష్టాన్ని మాత్రం కౌలురైతులు భరిస్తున్నారు. పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడుల నేపథ్యంలో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. లాభాలన్నీ అసలు రైతులకు చెందితే, నష్టం వాటిల్లినప్పుడు మాత్రం వాటిని కౌలురైతులు భరించాల్సి ఉంటోంది. రాష్టవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో గత టీడీపీ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు వారిపై దృష్టి సారించారు. కౌలురైతులకు భరోసా ఇచ్చేలా చర్యలు ప్రారంభించారు. ఇవి కొలిక్కివస్తున్న తరుణంలో తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించిన ఫైలును బుట్టదాఖలు చేసింది.

ఫ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ముఖ్యమంత్రి చంద్రబాబు కౌలురైతుల బాగోగులపై మరోసారి దృష్టిపెట్టారు. ఏం చేస్తే వారికి న్యాయం, భరోసా దక్కుతుందనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు ఓ ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ఆ ప్రకారం కౌలురైతులకు ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. దీనిద్వారా వారు భూములున్న రైతులతో సమానంగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందనున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతే ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మరిన్ని ప్రయోజనాలు కూడా కౌలురైతులకు చెందేలా చూడాలని సీఎం చంద్రబాబు చెబుతుండడంతో ఉన్నతాధికార యంత్రాంగం ఆపనిలో ఉంది. ఇచ్చినమాట నిలుపుకునేలా వీలైనంత త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇది అమల్లోకి వస్తే కౌలురైతుల ఇక్కట్లు తొలగి వారుకూడా గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవకాశం లభిస్తుంది.

Updated Date - Nov 08 , 2025 | 11:51 PM