Share News

పని తీరు ఆధారంగా పార్టీలో గుర్తింపు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:47 PM

:పని తీరు ఆధారంగానే పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. బుధవారం చీపు రుపల్లిలో ఏఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా రేగాన రామా రావు,వలిరెడ్డి శ్రీరాములునాయుడులతోపాటు సభ్యులు ప్రమాణ స్వీకారంచేశారు. ఈ సందర్భంగా కళా వెంకట రావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం దోచుకోవడంపై దృష్టిపెట్టిన మాజీ సీఎం జగన్‌మోహ నరెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూడలేకపోతున్నార న్నారు.

 పని తీరు ఆధారంగా పార్టీలో గుర్తింపు
మాట్లాడుతున్న కళావెంకటరావు

చీపురుపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):పని తీరు ఆధారంగానే పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. బుధవారం చీపు రుపల్లిలో ఏఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా రేగాన రామా రావు,వలిరెడ్డి శ్రీరాములునాయుడులతోపాటు సభ్యులు ప్రమాణ స్వీకారంచేశారు. ఈ సందర్భంగా కళా వెంకట రావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం దోచుకోవడంపై దృష్టిపెట్టిన మాజీ సీఎం జగన్‌మోహ నరెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూడలేకపోతున్నార న్నారు. వివిధ సంస్థలు లక్షల కోట్లతో విశాఖపట్నానికి తరలివస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, సారేపాక సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:47 PM