Polypadium పోలిపాడ్యమికి సిద్ధం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:27 AM
Ready for Polypadium ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవాలయాలు పోలిపాడ్యమి పూజలకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
గరుగుబిల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవాలయాలు పోలిపాడ్యమి పూజలకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీకమాసం ముగింపు కావడంతో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు నాగావళి నది తీరంలో స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగించనున్నారు. నదికి హారతులు ఇచ్చిన తర్వాత స్వామివారిని దర్శించు కోనున్నారు. ఈ నేపథ్యంలో భక్తజనం రద్దీ దృష్ట్యా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈవో బి.శ్రీనివాస్, ఎస్‌ఐ ఫకృద్ధీన్ తెలిపారు. సుమారు పది వేలకు మించి భక్తులు రానున్నారని, తోపులాటలు జరగకుండా సాఫీగా స్వామి దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టా మన్నారు. ఇకపోతే నాగావళి నది వద్ద స్నానపు గదులు, టెంట్లు సిద్ధం చేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయరాదని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో పాటు సుమారు 300లకు పైగా శ్రీవారి సేవకులు ఈ వేడుకల్లో భాగస్వాములవనున్నారు. మరోవైపు ఆలయ సిబ్బంది లడ్డూల తయారీలో నిమగ్నమయ్యారు.