Pension Distribution పింఛన్ల పంపిణీకి సన్నద్ధం
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:15 PM
Ready for Pension Distribution జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్లు పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీపై శుక్రవారం డీఆర్‌డీఏ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్వతీపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్లు పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీపై శుక్రవారం డీఆర్‌డీఏ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీపై ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నోటీసులు అందుకున్న దివ్యాంగ పింఛన్ దారులు ఆన్‌లైన్‌లో అప్పీల్ చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
అప్పీల్‌కు ముగియనున్న గడువు
నోటీసులు అందుకున్న దివ్యాంగ పింఛన్‌దారులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ఆన్‌లైన్‌లో అప్పీలు చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి తెలిపారు. అర్హత కలిగిన వారికి ఒకటో తేదీన పింఛను పంపిణీ జరుగుతుందన్నారు.