Grain Procurement ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:17 AM
Ready for Grain Procurement ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్ రైతుల నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకు అవసరమైన రవాణా, హమాలీ, గోనె సంచులు తదితర వాటిని అందుబాటులోకి ఉంచుకోవాలని సూచించారు. మరో రెండు, మూడు రోజుల్లో పీపీసీల జాబితా సిద్ధం కానుందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో షెడ్యూలింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్వింటా సాధారణ రకానికి రూ.2,369, గ్రేడ్-ఏ రకానికి రూ.2,389గా ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.