‘Deworming Day’ ‘డీ వార్మింగ్ డే’కు సన్నద్ధం
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:56 PM
Ready for ‘Deworming Day’ జిల్లావ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించనున్న డీ వార్మింగ్ డే (నులిపురుగుల నివారణ దినోత్సవం)కు సన్నద్ధం కావాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. పిల్లలతో తప్పనిసరిగా ఆల్‌బెండాజోల్ మాత్రలు వేయించాలన్నారు.
పార్వతీపురం, ఆగస్టు6(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించనున్న డీ వార్మింగ్ డే (నులిపురుగుల నివారణ దినోత్సవం)కు సన్నద్ధం కావాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. పిల్లలతో తప్పనిసరిగా ఆల్‌బెండాజోల్ మాత్రలు వేయించాలన్నారు. బుధవారం తన కార్యాలయంలో వైద్య సిబ్బందికి ఆల్‌బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ అన్ని శాఖల సిబ్బందితో మండల, సచివాలయాల స్థాయిల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు, విద్యార్థులకు అంగన్‌వాడీ, పాఠశాల, కళాశాలల్లో మాత్రలు వేయించాలి. చిన్నారులకు సగం మాత్ర, రెండు, మూడు సంవత్సరాల పిల్లలకు పూర్తిమా త్ర నీటితో ఇవ్వాలి. మూడు నుంచి 19 సంవత్సరాల వారు పూర్తి మాత్ర నమిలేలా చూడాలి. 20న మాప్ అప్ కార్యక్రమం నిర్వహించాలి.’ అని తెలిపారు. ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. జిల్లాకు 2,13,000 ఆల్‌బెండాజోల్ మాత్రలు సరఫరా అయ్యాయని, 1,96,612 మందితో మాత్రలు వేయిస్తామని వెల్లడించారు.