District Panchayat Officer జిల్లా పంచాయతీ అధికారిగా రవీంద్ర
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:08 AM
Ravindra Appointed as District Panchayat Officer జిల్లా పంచాయతీ అధికారిగా ఎస్.రవీంద్రను నియమించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణకుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో గరుగుబిల్లి ఎంపీడీవోగా రవీంద్ర విధులు నిర్వహించారు.

పార్వతీపురం/గరుగుబిల్లి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ అధికారిగా ఎస్.రవీంద్రను నియమించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణకుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో గరుగుబిల్లి ఎంపీడీవోగా రవీంద్ర విధులు నిర్వహించారు. ఉపాధి హామీ ఏపీడీగా, జిల్లా విజిలెన్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో డివిజనల్ అభివృద్ధి అధికారిగా, జిల్లా డ్వామా ఫైనాన్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. బదిలీల నేపథ్యంలో ఆయన్ని మన్యం జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం డీపీవోగా ఉన్న టి.కొండలరావును రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి సమాచారం అందించాలని ఆదేశించారు. బదిలీల్లో స్థానాన్ని కేటాయించలేదు. నూతన డీపీవో రవీంద్ర కొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
సాలూరు మున్సిపల్ కమిషనర్‌గా జైరామ్
సాలూరు, జూన్10(ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.జైరామ్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ పట్టణం జీవీఎంసీలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బదిలీపై ఇక్కడకు రానున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు సాలూరు పురపాలక సంఘం కమిషనర్‌గా పనిచేసిన డీటీవీ.కృష్ణను జగ్గయ్యపేటకు బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా మూడు నెలల లోపే ఆయన బదిలీపై వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశ మవుతోంది.
మరికొందరికి బదిలీలు
పార్వతీపురం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఉద్యాన శాఖాధికారి శ్యామలకు విశాఖపట్నం బదిలీ అయింది. ఆమె స్థానంలో గతంలో జిల్లా ఉద్యాన శాఖాధికారిగా పనిచేసిన సత్యనారాయణరెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన విశాఖలో పనిస్తున్నారు. వెలుగు ఏపీడీగా పనిచేస్తున్న సత్యంనాయుడుకు తూర్పుగోదావరి జిల్లా బదిలీ అయింది. ప్రస్తుతం వెలుగును డీఆర్‌డీఏలో విలీనం చేయడంతో ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదని సమాచారం.