Share News

Ranks in File Clearance ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:29 AM

Ranks in File Clearance ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల వారీగా ప్రభుత్వం బుధవారం ర్యాంకులు ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో మంత్రులు గుమ్మిడి సంధ్యా రాణి 19వ స్థానంలో , కొండపల్లి శ్రీనివాస్‌ పదో స్థానంలో నిలిచారు.

Ranks in File Clearance  ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు

  • 19వ స్థానంలో మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల వారీగా ప్రభుత్వం బుధవారం ర్యాంకులు ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో మంత్రులు గుమ్మిడి సంధ్యా రాణి 19వ స్థానంలో , కొండపల్లి శ్రీనివాస్‌ పదో స్థానంలో నిలిచారు. ఎనిమిది రోజుల్లో మంత్రి సంధ్యారాణి 545 ఫైళ్లలో 530 క్లియర్‌ చేశారు. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వద్దకు 272 ఫైళ్లురాగా 269కి క్లియరెన్స్‌ చూపారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తొమ్మిది రోజుల్లో 119 ఫైళ్లకు గాను 113 , జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల్లో 152 ఫైళ్లలో వంద ఫైళ్లకు క్లియరెన్స్‌ చూపారు. కాగా తొలిస్థానంలో డోల బాలవీరాంజనేయస్వామి , సీఎం చంద్రబాబు ఆరోస్థానంలో ఉన్నారు. మంత్రి నారా లోకేశ్‌ 9వ స్థానంలో, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 11వ స్థానంలో ఉన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:29 AM