Share News

Ramasunder Reddy as Collector కలెక్టర్‌గా రామసుందర్‌ రెడ్డి

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:58 PM

Ramasunder Reddy as Collectorజిల్లా కలెక్టర్‌గా ఎస్‌.రామసుందర్‌ రెడ్డిని(2015) నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటివరకూ రిహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు.

Ramasunder Reddy as Collector కలెక్టర్‌గా రామసుందర్‌ రెడ్డి

కలెక్టర్‌గా రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.రామసుందర్‌ రెడ్డిని(2015) నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటివరకూ రిహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. కాగా ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంబేడ్కర్‌ గత ఏడాది జూన్‌ 24న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్‌గా వస్తున్న రామసుందర్‌ రెడ్డి కడప జిల్లా చాపాడు వాసి. ఈయన కర్నూల్‌ జిల్లా ఆధోని ఆర్‌డీవోగా, అదే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసిన తరువాత ఇరిగేషన్‌లో రిహాబిలిటేషన్‌ అండ్‌ రిసెటిల్‌మెంట్‌ కమిషనర్‌గా నియామకమయ్యారు. అక్కడి నుంచి తాజాగా విజయనగరం జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

Updated Date - Sep 11 , 2025 | 11:58 PM