Rajam needs to become more famous. రాజాంకు మరింత పేరు రావాలి
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:24 AM
Rajam needs to become more famous. ఎంతో మంది కళాకారులు తయారైన రాజాం ప్రాంతానికి మరింత పేరు రావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. రాజాం మునిసిపాలిటీ పరిధిలోని సెయింటెన్స్ స్కూల్ వెనక భాగంలో నిర్మించిన జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రాన్ని ఆయన ఆదివారం ప్రాంభించారు.
రాజాంకు మరింత పేరు రావాలి
కళాకారులుండే ప్రాంతంగా ప్రఖ్యాతి
మంత్రి కందుల దుర్గేష్
రాజాం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎంతో మంది కళాకారులు తయారైన రాజాం ప్రాంతానికి మరింత పేరు రావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. రాజాం మునిసిపాలిటీ పరిధిలోని సెయింటెన్స్ స్కూల్ వెనక భాగంలో నిర్మించిన జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రాన్ని ఆయన ఆదివారం ప్రాంభించారు. అనంతరం మాట్లాడుతూ కళాకారుల అభ్యున్నతి కోసం కళాక్షేత్రాం నిర్మించేందుకు జీఎంఆర్ 50 సెంట్ల స్థలాన్ని ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. వచ్చే ఏడాది రాజాంలో పాలిటెక్నిక్ కళాశాల, పీజీ సెంటర్ ఏర్పాటు కోసం పది ఎకరాలు ఇస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంథి మల్లిఖార్జునరావు మాట ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కళారంగానికి ఈ ప్రాంతంలో చాలా ఆదరణ ఉందని, ఎందరో కళాకారులు తయారయ్యారని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు లాంటి వారు మరింత మంది రావాలని కోరారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటికలు సామాజిక చైతన్యంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని, కళాకారుల అభ్యున్నతి కోసం కళాక్షేత్రం ఏర్పాటుకు జీఎంఆర్ ఉచితంగా స్థలాన్ని ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం ఆడిటోరియాన్ని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, లోకం నాగమాధవి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు, నాయకులు పాల్గొన్నారు.