రాజాం సామాజిక ఆసుపత్రికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:00 AM
రాజాం సామాజిక ఆసుపత్రి(100 పడకలు) స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు ఎంపికైంది.
రాజాం/ రూరల్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాజాం సామాజిక ఆసుపత్రి(100 పడకలు) స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు ఎంపికైంది. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత చేతులమీదుగా ఆసుపత్రి సూపరింటెండెం ట్ డా.కరణం హరిబాబు అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. డా.హరిబాబు సూపరింటెండెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నుంచి ఆసుపత్రిలో టాయిలెట్స్, వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ, రక్షిత తాగు నీరు, రోగులకు రుచికరమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ చేపట్టిన కార్యక్రమాలు సత్పఫలితాలనిచ్చాయి.
బాధ్యత పెంచింది..
ఆసుపత్రికి అవార్డు రావడంతో బాధ్యతను మరింత పెంచింది. ఆసుపత్రి నిర్వహణ సజావుగా సాగేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ సహకరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులపై కొంతమందికి ఉన్న అపోహను తొలగించేందుకు ప్రయత్నిస్తాను.
- డా.కరణం హరిబాబు, సూపరింటెండెంట్, రాజాం సామాజిక ఆసుపత్రి