రాజాం ఏఎంసీ కమిటీ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:49 PM
రాజాం ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
రాజాం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాజాం ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా వీరు పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌గా గురవాన పార్వతి, వైస్ చైర్‌పర్సన్‌గా ఎల్.ధనలక్ష్మి, కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పల నాయుడు, బొత్స వాసుదేవరావు నాయుడు, కోండ్రు జగదీష్, కె.అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.