Rain ఈదురుగాలులతో వాన
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:47 PM
Rain with Gusty Winds డివిజన్ కేంద్రం పాలకొండలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచింది.
పాలకొండ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రం పాలకొండలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచింది. వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించలేపోయారు. ఉరుములు, మెరుపుల శబ్దాలకు జనం హడలెత్తిపోయారు. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 7:30 వరకు కరెంట్ రాకపోవడంతో చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక సీతంపేట, వీరఘట్టం మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. చాలా గ్రామాల్లో ఆదివారం రాత్రి అంధకారం నెలకొంది.