రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:24 AM
మండలంలో చింతలబెలగాం పంచాయతీ తుమ్మలదత్తివలసకు చెందిన బంకపల్లి సత్యనారాయణ (45) ఈనెల 26న కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే బైపాస్ క్యాబిన్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా రైలు ఢీకొని మృతి చెందాడు.
జియ్యమ్మవలస, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో చింతలబెలగాం పంచాయతీ తుమ్మలదత్తివలసకు చెందిన బంకపల్లి సత్యనారాయణ (45) ఈనెల 26న కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే బైపాస్ క్యాబిన్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. ఆయన మొదట మిలటరీలో పనిచేశాడు. పదవీ విరమణ అనంతరం రైల్వే ట్రాక్ మెంటైనెన్స్ నాలుగో తరగ తి ఉద్యోగిగా చేరాడు. అయితే సంఘటన జరిగిన అనంతరం విషయాన్ని సత్య నారాయణ కుటుంబానికి సమాచారం చేరవేశారు. అనంతరం మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేర కు మృతదేహాన్ని బుధవారం తుమ్మలదత్తివలసకు కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణకు భార్య సంధ్యారాణి, కుమారుడు నాని, కుమార్తెతో పాటు తల్లిదండ్రులు బంకపల్లి రాములు, రేగాలమ్మ, ముగ్గురు అక్కా చెల్లెల్లు ఉన్నారు. దీనిపై సామర్లకోట రైల్వే పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.