లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:03 AM
పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.
30 మందిపై కేసుల నమోదు
రాజాం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. శ్రీకా కుళం లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ బలరాం కృష్ణ, బొబ్బిలి లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ సుందరి సంయుక్తంగా పండ్ల దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. తూకంలో తేడాలు గుర్తించారు. ఈ మేరకు 30 మందిపై కేసులు నమోదు చేశారు. తూకంలో అక్రమాలకు పాల్పడినా, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ బలరాంకృష్ణ హెచ్చరించారు.