రామతీర్థంలో తెప్పోత్సవం
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:01 AM
రామతీర్థంలోని శ్రీరామస్వామి ఆలయంలో గల రామకోనేరులో ఆదివారం రాత్రి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రాత:కాలార్చన, బాలభోగం, యాగశాలలో సుందరకాండ హావనం, ఉత్సవమూర్తులకు నిత్యకళ్యాణం నిర్వహించారు.ఆషాడశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక ఏకాదశి వరకు చాతు ర్మసాదీక్షలో మహావిష్ణు యోగనిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు మేల్కొని ద్వాదశి నాడు క్షీరసముద్రంలో దేవతలకు దర్శనం ఇస్తారు.
నెల్లిమర్ల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రామతీర్థంలోని శ్రీరామస్వామి ఆలయంలో గల రామకోనేరులో ఆదివారం రాత్రి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రాత:కాలార్చన, బాలభోగం, యాగశాలలో సుందరకాండ హావనం, ఉత్సవమూర్తులకు నిత్యకళ్యాణం నిర్వహించారు.ఆషాడశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక ఏకాదశి వరకు చాతు ర్మసాదీక్షలో మహావిష్ణు యోగనిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు మేల్కొని ద్వాదశి నాడు క్షీరసముద్రంలో దేవతలకు దర్శనం ఇస్తారు. దీనిని పురస్క రించుకొని ప్రతి ఏటా కార్తీకశుద్ధ ఏకాదశి నాడు రామతీర్థంలో శ్రీరామస్వామి వారు చాతుర్మసా దీక్షలో యోగనిద్ర నుంచి మేల్కొని ద్వాదశి నాడు శ్రీరామస్వామివారు ఆల యం పుష్కరినిలో తెప్పోత్సవంలో భక్తులకు కనువిందు చేస్తారు. కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నెల్లిమర్ల పోలీసులు, మత్స్యశాఖసిబ్బంది పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌కుమార్, సుదర్శనం పవన్‌కు మార్, రాంగోపాల్ తదితరులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.