Share News

నాణ్యమైన విద్యనందించాలి: డిప్యూటీ డీఈవో

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:00 AM

:విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం తోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని విజయనగరం డిప్యూటీ డీఈవో కె. వెంకటరమణ కోరారు. మంగళవారం నెల్లిమర్ల నగరపంచాయతీలోని సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌, జడ్పీహెచ్‌ఎస్‌ జరజాపుపేట, ఆదిత్య పబ్లిక్‌, విశ్వంభ స్కూల్‌ను వెంకట రమణ పరిశీలించారు.

నాణ్యమైన విద్యనందించాలి: డిప్యూటీ డీఈవో
సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న వెంకటరమణ

నెల్లిమర్ల, నవంబరు 4(ఆంధ్రజ్యోతి):విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం తోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని విజయనగరం డిప్యూటీ డీఈవో కె. వెంకటరమణ కోరారు. మంగళవారం నెల్లిమర్ల నగరపంచాయతీలోని సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌, జడ్పీహెచ్‌ఎస్‌ జరజాపుపేట, ఆదిత్య పబ్లిక్‌, విశ్వంభ స్కూల్‌ను వెంకట రమణ పరిశీలించారు. సోషల్‌వెల్ఫేర్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజనాలను పరిశీలిం చిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. కాగాజరజాపుపేట ఉన్నత పాఠశాల లో గణిత ఉపాధ్యాయుడు శివుకు బంగారయ్య పదో తరగతి విద్యార్థులకు ఉచితం గా గణిత దీప్తిపేరిట స్టడీ మెటీరియల్‌ను సమకూర్చిగా వెంకటరమణ అందజేశా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం కామేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:00 AM