Share News

Pydimamba in the children's temple బాలాలయంలో పైడిమాంబ

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:24 AM

Pydimamba in the children's temple ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడిమాంబ అమ్మవారు బాలాలయంలో సోమవారం కొలువుదీరారు. ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యేవరకు అక్కడే పూజలు అందుకోనున్నారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక అక్కడికే వెళ్లాలి. రూ.1.80 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, దేవదాయశాఖ కమిషనర్‌ కె.శిరీష ప్రకటించారు.

Pydimamba in the children's temple బాలాలయంలో పైడిమాంబ
ఘటాలతో వస్తున్న ఎమ్మెల్యే అదితి, పూజారి వెంకట్రావు, కమిషనర్‌ శిరీష

బాలాలయంలో పైడిమాంబ

ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ అక్కడే కొలువు

ఇక భక్తులకూ అక్కడే దర్శనం

రూ.1.80 కోట్లతో ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే అదితి

విజయనగరం కల్చరల్‌, నవంబరు10(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడిమాంబ అమ్మవారు బాలాలయంలో సోమవారం కొలువుదీరారు. ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యేవరకు అక్కడే పూజలు అందుకోనున్నారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక అక్కడికే వెళ్లాలి. రూ.1.80 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, దేవదాయశాఖ కమిషనర్‌ కె.శిరీష ప్రకటించారు.

అమ్మవారిని బాలాలయంలో తాత్కాలికంగా కొలువుదీర్చే ందుకు సోమవారం వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో కళాప్రకర్షణ నిర్వహించారు. 11.53 గంటలకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఏసీ శిరీష, ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావులు మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవ విగ్రహ ఘటాలను బాలాలాయం వరకూ తీసుకువెళ్లారు. బాలాలయంలో పూజలు అనంతరం అమ్మవారి దర్శనాన్ని తొలుత అద్దంలో చూసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ చదురుగుడి విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ అమ్మవారు బాలాలయంలోనే ఉంటారని, అక్కడే భక్తులకు దర్శనాలు ఉంటాయన్నారు. వచ్చే సిరిమాను సంబరాలకు ముందుగానే విస్తరణ పనులు పూర్తి చేస్తామని, ఇందుకు రూ.1.80కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ప్రతినెలా చదురుగుడి వద్ద జరిగే చండీహోమం వనంగుడి ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు. సోమవారం ఉదయం తొలుత చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. ఆపై ఎమ్మెల్యే అదితి, ఏసీ శిరీష, పూజారి వెంకట్రావు ఘటాలను నెత్తినపెట్టుకుని పైడిమాంబ నినాదాల మధ్య బాలాలయం వరకూ ఊరేగింపుగా వెళ్లారు.

Updated Date - Nov 11 , 2025 | 12:24 AM