అందరి సహకారంతో ఘనంగా పైడిమాంబ పండుగ
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:52 PM
పైడిమాంబ జాతర మహోత్సవాన్ని అందరి సహకారంతో ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తా మని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి తెలిపా రు.
నగర మేయర్ లక్ష్మి
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 16(ఆంధ్ర జ్యోతి): పైడిమాంబ జాతర మహోత్సవాన్ని అందరి సహకారంతో ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తా మని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి తెలిపా రు. మంగళవారం స్థానిక నగరపాలక సమావేశ మం దిరంలో ఆమె అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావే శం నిర్వహించారు. అజెండాలో పొందుపరిచిన 21 అంశాలకు ఆమోదం తెలిపారు. అలాగే అనుబంధంగా చేర్చిన మూడు అంశాలు కూడా సభ్యులు ఆమోదిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైడిమాం బ మహోత్సవానికి నగరపాలక సంస్థ ద్వారా రూ.60లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు నగరవాసులకు ఈ సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. పాక్షిక మరమ్మతులు నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే తాగునీటి పంపిణీ, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించామ న్నారు. సమావేశంలో కమిషనర్ పి.నల్లనయ్య, ఫ్లోర్‌లీటర్ ఎస్‌వీవీ రాజేష్, సభ్యులు అల్లు చాణక్య, జీవీ రంగారావు, సుంకరి నారాయణస్వామి, రేగాన రూపావతి దేవీ, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరా జు, వివిధ విభాగ అధికారులు పాల్గొన్నారు.