Share News

పైడిమాంబ పండుగ చాటింపు

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:05 AM

పైడిమాంబ పండుగ చాటింపు కార్యక్రమాన్ని ఆదివారం సంప్రదాయబద్ధంగా అధికారులు నిర్వహించారు.

 పైడిమాంబ పండుగ చాటింపు
మహాచండి అవతారంలో పైడిమాంబ

విజయనగరం రూరల్‌/కల్చరల్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ పండుగ చాటింపు కార్యక్రమాన్ని ఆదివారం సంప్రదాయబద్ధంగా అధికారులు నిర్వహించారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌, ఆలయ ఈవో కె.శిరీష ఆధ్వర్యంలో తలయారి రామవరపు చినపైడిరాజు మూడులాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి వద్ద అమ్మవారి చాటింపు డప్పులు కొట్టారు. మొక్కుబడులు తీర్చుకోవడానికి చాటింపు కార్యక్రమాన్ని శుభ ముహూర్తంగా ప్రజలు భావిస్తారు.

మహాచండి అవతారంలో..

రైల్వే స్టేషన్‌ రోడ్డులోని వనంగుడిలో పైడిమాంబ అమ్మవారు ఆదివారం మహాచండి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పసుపు, కుంకుమ, చెరకు గడలను నైవేద్యంగా సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

Updated Date - Sep 29 , 2025 | 12:05 AM