Share News

పూసపాటిరేగ ఏఎంసీ కార్యవర్గ ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:12 AM

పూసపాటిరేగ మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

పూసపాటిరేగ ఏఎంసీ కార్యవర్గ ప్రమాణస్వీకారం

పూసపాటిరేగ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగ మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్‌గా గేదెల గాయత్రీతో పాటు పాలకమండలి కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కార్యవర్గం రైతులకు అన్ని రకాల సహకారాలు అందజేయాలన్నారు. బంగార్రాజు మాట్లాడుతూ పాలకవర్గానికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌, బీజేపీ ఇన్‌చార్జి బూర్లె శ్రీధర్‌, కడగల ఆనంద్‌, పల్లె భాస్కరరావు, గేదెల రాజారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు శివ పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 12:12 AM