Share News

jeedi pikkalu వీడీవీకేల ద్వారా జీడి పిక్కల కొనుగోలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:00 AM

Purchase of jeedi pikkalu through vdvk వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) ద్వారా నాణ్యమైన జీడి పిక్కలు కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు. జీడి పరిశ్రమకు అవసరమైన ముడి సరుకుల కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.

 jeedi pikkalu   వీడీవీకేల ద్వారా జీడి పిక్కల కొనుగోలు
అధికారులతో మాట్లాడుతున్న జేసీ శోభిక

పార్వతీపురం/జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) ద్వారా నాణ్యమైన జీడి పిక్కలు కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు. జీడి పరిశ్రమకు అవసరమైన ముడి సరుకుల కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కొమరాడ మండలం చోళ్లపధంలో జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జేసీ సందర్శించారు. జీడిపిక్కలు, రికార్డులను పరిశీలించారు. ముందుగా వీడీవీకే సభ్యులు, జీడి రైతులతో మాట్లాడారు. అనంతరం సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే కొనుగోలు చేసిన జీడి పిక్కలను స్టోరేజ్‌ చేసే అవకాశం లేదనే విషయం ఏపీఎం సురేష్‌ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తామని, పరిశ్రమకు తరలించే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కిలో జీడి పిక్కలను రూ. 155 కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చోళ్ళపధం, అంకుళ్లవలస గ్రామాల్లో వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రాలకు వెళ్లి జీడి పిక్కలను అమ్ముకోవచ్చని తెలిపారు.

దళారులను నమ్మి మోసపోకుండా..

పాచిపెంట, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): దళారులను నమ్మి రైతులు మోసపోకుండా వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేస్తామని ఉద్యాన శాఖ అధికారి బి.శ్యామల తెలిపారు. మంగళవారం పిండ్రింగివలసలో జీడి పిక్కలను పరిశీలించారు. నందేడవలస, పద్మాపురంలలో వీడీవీకేల ద్వారా జీడి పిక్కలను కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వెల్లడించారు. ఈ పరిశీలనలో వెలుగు సీసీలు , వీడీవీకే కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:00 AM