Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:00 AM

ప్రజా సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాజాం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పైపులైన్లకు ఆయన శుక్రవారం శంకు స్థాపన చేశారు. కాంపెక్ట్‌ డస్ట్‌ బిన్లు, చెత్తసేకరణ బళ్లను ప్రారంభించారు. మున్సిపాలిటీలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్‌ వర్కర్‌ పడాల వేణు ఇటీవల మృతి చెందడంతో ఎక్స్‌గ్రేషియా కింద రూ.2లక్షలు మంజూరు చేయడంతో పాటు దహన సంస్కారాలకు రూ.15 వేలు చెక్కును అతని భార్య పడాల నాగమ్మకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం బుచ్చింపేటలో సీసీ రోడ్లు, కాలువలకు, వినాయకనగర్‌ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనే జీ, తాగునీటి పైప్‌లైన్లకు భూమి పూజ చేశారు. పొను గుటివలసలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. పొనుగిటివలసలో కోనేరు అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.

స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించి సుమారు 42 వినతులు స్వీకరించారు. రేగిడి మండలం గుల్లపాడు గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త నారు జనార్దన గత కొద్దినెలలు కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో, రూ.5లక్షల ప్రమాద బీమా పత్రం అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్నేహం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆయన పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. కోటేశ్వరరావు, కొత్త సాయిప్రశాంత్‌కుమార్‌, బీవీ అచ్యుత్‌కుమార్‌, పెంకి చైతన్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:00 AM