Share News

PSP Project దుగ్గేరులో పీఎస్‌పీ ప్రాజెక్టు

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:24 PM

PSP Project in Duggeru జిల్లాలో మక్కువ మండలం దుగ్గేరు ప్రాంతంలో పీఎస్‌పీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన కెబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చింత గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన అభ్యర్థనపై రెండు ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించింది.

PSP Project దుగ్గేరులో పీఎస్‌పీ ప్రాజెక్టు

పార్వతీపురం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మక్కువ మండలం దుగ్గేరు ప్రాంతంలో పీఎస్‌పీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన కెబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చింత గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన అభ్యర్థనపై రెండు ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించింది. దుగ్గేరు వద్ద 2వేల మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టుకు కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 కింద దుగ్గేరు పీఎస్‌పీ కోసం జలవనరులశాఖ సాగునీరు అందించనుంది. వీఆర్‌ఎస్‌ లేదా తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి వన్‌టైం ఫిల్లింగ్‌ కోసం నీటిని కేటాయించానున్నారు. ఈ భారీ పంపుడ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు నుంచి 40 సంవత్సరాలకు రూ.1230 కోట్ల గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఉత్పత్తి అవుతుంది. ఎకరానికి రూ. 50 వేల చొప్పున స్థానిక ప్రాంత అభివృద్ధి చార్జీలు వసూలు చేస్తారు.. ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేల మంది సభ్యులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది.

Updated Date - Oct 10 , 2025 | 11:24 PM