Waterfalls జలపాతాల వద్ద వసతుల కల్పన
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:08 AM
Providing Amenities at Waterfalls మండలంలో జలపాతాల వద్ద వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆదే శించారు. మంగళవారం నీలంవలస సమీపంలోని జలపాతాన్ని సందర్శించారు.
పాచిపెంట, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మండలంలో జలపాతాల వద్ద వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆదే శించారు. మంగళవారం నీలంవలస సమీపంలోని జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. మహిళా లబ్ధిదారులకు రుణం మంజూరు చేసి ఈ ప్రాంతంలో పలు దుకాణాలు ఏర్పాటు చేయాలని వెలుగు ఏపీఎం రెడ్డి శ్రీరాములుకు సూచించారు. గ్రామస్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని ఉపాధి, వెలుగు అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో పాత్రో, ఏజీఎం కామరాజు, డీఆర్‌డీఏ డీపీఎంలు తదితరులు ఉన్నారు.