వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించండి
ABN , Publish Date - May 28 , 2025 | 12:31 AM
వసతిగృహాల్లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కొత్తవలస కోర్టు న్యాయాధికారి డాక్టర్ సముద్రాల విజయచందర్ అధికారులను ఆదేశించారు.
కొత్తవలస, మే 27 (ఆంధ్రజ్యోతి): వసతిగృహాల్లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కొత్తవలస కోర్టు న్యాయాధికారి డాక్టర్ సముద్రాల విజయచందర్ అధికారులను ఆదేశించారు. మండలంలోని వివిధ వసతి గృహాలను మంగళవారం ఆయన పరిశీలించారు. మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. ఈమేరకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. న్యాయవాద సంఘ అధ్యక్షురాలు వీఎల్ దేవి తదితరులు పాల్గొన్నారు.