మెరుగైన సేవలందించండి: ఎంజీఆర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:03 AM
ప్రజలకు మెరుగైన సేవలందించి మంచి పేరు తీసుకురావాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమ వారం స్థానికక్యాంపుకార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన హ్యాండ్‌రైడ్ మొబైల్ సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో చింతాడ ఇందిర, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘ మండలాధ్యక్షురాలు బలివాడ శాం తకుమారి పాల్గొన్నారు.
పాతపట్నం, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సేవలందించి మంచి పేరు తీసుకురావాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమ వారం స్థానికక్యాంపుకార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన హ్యాండ్‌రైడ్ మొబైల్ సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో చింతాడ ఇందిర, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘ మండలాధ్యక్షురాలు బలివాడ శాం తకుమారి పాల్గొన్నారు.
క్రీడలలో రాణించాలి
విద్యార్థి దశనుండే క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. శ్రీకాకుళంలో జరిగిన పెన్‌సాక్ సిలాట్ పోటీల్లో మెళియాపుట్టి కేజీబీవీ విద్యార్థిని గార అవంతిక అండర్-17 విభాగంలో ఫైట్ మూమెంట్‌లోగోల్డ్ మెడల్ సాధించడంతో పాతపట్నంలో అవంతిక, కోచ్ సోనియాను అభినందించారు.అలాగే అంతరాబలో జరిగిన క్రిస్మస్‌వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.