మెరుగైన వైద్యసేవలందించండి: కలెక్టర్
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:15 AM
వ్యాధుల నియంత్రణపై దృష్టిసారించి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆరోగ్యశాఖాధికారులకు సూచించారు.
పార్వతీపురం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వ్యాధుల నియంత్రణపై దృష్టిసారించి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆరోగ్యశాఖాధికారులకు సూచించారు. వినూత్న కార్యక్రమాల అమలుతో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.భాస్కరరావు తన వైద్య బృందంతో కలెక్టరేట్‌లో శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ ముస్తాబు కార్యక్రమం ఆరోగ్యం రీత్యా ఎంతగానో దోహ దపడుతోందని, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు.కలెక్టర్ ప్రవేశపెట్టిన మాఊరికి మలేరియా వచ్చింది కార్య క్రమంతో జిల్లాలో మలేరియా కేసులు చాలా వరకు తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కేవీఎస్.పద్మావతి, ప్రోగ్రాం అధికారులు టి.జగన్మోహన్‌రావు, పీఎల్.రఘుకుమార్, ఎం. వినోద్‌కుమార్, సూర్యకౌశిక్, ఏపీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిషోర్, నేత్ర వైద్యాధికారి నాగేష్‌రెడ్డి, డెమో గిరిబాబు పాల్గొన్నారు.కాగా పార్వతీపురం మన్యం జిల్లా ఏపీ ఎన్‌జీవో, నాన్ గెజిటెడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిషోర్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం మంత్రితో పాటు కలెక్ట ర్‌ను కలిసిఉద్యోగులు సమస్యలను వివరించారు. కాగా జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వ హించిన వ్యాసరచన పోటీల్లో పార్వతీపురానికి చెందిన విద్యార్థిని నిఖిత రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అభినందించారు. ఈనెల 20న జిల్లా స్థాయి పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన ఎస్‌ఎం నిఖిత, ఠాగూర్‌నాయుడు, ఎం ఎం.వైష్ణవి, కె.పూర్ణచందు తదితరులు ఉత్తమ ప్రతిభ కనబరచడంతో వారిని కూడా అభినందించారు.