నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:55 PM
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
సాలూరు, జూన్ 16(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. సాలూరు మున్సి పల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో డ్వామా పీవో కె.రామచంద్రరావుతో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. వేగం, నాణ్యత, నిష్పక్షపాతంగా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 154 వినతులు వచ్చాయని తెలిపారు. రామా కాలనీలో నివా సం ఉంటున్న చిక్కాల జ్యోతి తన పేరు మీద లేని కరెం టు మీటర్ రీడింగ్ వల్ల తల్లికి వందనం పథకంలో తన పేరు లేదని, సమస్య పరిష్కరించాలని కోరారు. పట్టణం లో బంగారమ్మ కాలనీలో ఉన్న స్నాక్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని పలువురు వినతిప త్రం అందజేశారు. మావుడి- కందులపథం గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని అక్కేన తిరుపతిరావు కోరారు. ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్ట్‌పాల్, డీఎంహెచ్ వో ఎస్.భాస్కరరావు, జిల్లా పరిశ్రమల అధికారి కె.కరు ణాకర్, మున్సిపల్ కమిషనర్ జయరాం పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు
పార్వతీపురం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో అందిన వినతులకు తక్షణమే పరిష్కారం చూపాలని డీఆర్వో కె.హేమలత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొని, వినతులు స్వీకరించారు. మొత్తం 118 వినతులు వచ్చినట్టు తెలిపారు. భామిని మండలం నల్లరాయిగూడలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 150 మంది ఉన్నారని, కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేనందున వారంతా చదువుకు దూరం అవుతున్నారని గ్రామస్థులు వినతిని అందించారు. కురుపాం పంచాయతీలోని సీతంపేట, పరికివలస, పాత కురుపాం, కాటందొరవలస, కస్పా గదబవలస గ్రామాలకు నెలసరి రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని, సీతంపేటలో కొత్త రేషన్ డిపోకు అనుమతి ఇవ్వాలని ఆ గ్రామస్థులు వినతిని అందించారు. ఇలా వివిధ వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 60..
సీతంపేట రూరల్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఏవో సునీల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలు సమస్యలు పరిష్కారం కోరుతూ 60 వినతులు వచ్చాయి. సీతంపేట ఏపీఆర్‌జేసీ పాఠశాలలో అటెండర్ పోస్టు ఇప్పించాలని కోసిమానుగూడ గ్రామానికి చెందిన ఆరిక బాలకృష్ణ కోరారు. బ్యాంక్ కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కూరంగి శ్యామల కోరగా పెద్దతంకిడి గ్రామంలో రచ్చబండ నిర్మించాలని బిడ్డిక రమేష్‌లు ఏవోను కోరారు. ఇలా అనేక సమస్యలు పరిష్కారం కోరుతూ వినతులు వచ్చాయి. ఏవో సునీల్‌తో పాటు టీడబ్ల్యూ డీఈ సింహాచలం, ఏఎంవో కోటిబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మధుసూదనరావు పాల్గొన్నారు.
గడువు లోపు సమస్యలు పరిష్కరించాలి: ఏఎస్పీ
బెలగాం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): నిర్దేశించిన సమ యంలో సమస్యలు పరిష్కరించాలని ఏఎస్పీ అంకితా సురాన ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. త్వరితగతిన ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు.