Protest wave hits Delhi ఢిల్లీని తాకిన నిరసన సెగ
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:58 PM
Protest wave hits Delhi జిందాల్ నిర్వాసితుల నిరసన సెగ ఢిల్లీని తాకింది. బొడ్డవర గ్రామంలో 80 రోజులుగా శిబిరం ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా పోరాడు తున్న వారు తమ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి రైలులో ఢిల్లీకి మంగళవారం బయలుదేరారు. బుధవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. నానాదాలతో హోరెత్తించారు.
ఢిల్లీని తాకిన నిరసన సెగ
జంతర్ మంతర్ వద్ద జిందాల్ నిర్వాసితుల పోరాటం
హాజరైన ఎమ్మెల్సీ రఘురాజు
ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిందాల్ నిర్వాసితుల నిరసన సెగ ఢిల్లీని తాకింది. బొడ్డవర గ్రామంలో 80 రోజులుగా శిబిరం ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా పోరాడు తున్న వారు తమ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి రైలులో ఢిల్లీకి మంగళవారం బయలుదేరారు. బుధవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. నానాదాలతో హోరెత్తించారు. జిందాల్ యాజమాన్యం నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జిల్లా రైతుసంఘ ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు. 18ఏళ్ల క్రితం కంపెనీ ఏర్పాటు చేస్తామని జందాల్ యాజమాన్యం తీసుకున్న భూములను వెనక్కి ఇవ్వాలని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తొలుత మోకాళ్లపై కూర్చుని జాతీయ జెండాలు చేతపట్టి నిరసన తెలిపారు. అనంతరం ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేశారు. తమ నిరసనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఢిల్లీ ప్రభుత్వం కోరిన వెంటనే ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ జిందాల్ భూసేకరణలో ఎన్నో తప్పులకు పాల్పడిందని, అడుగడుగునా రైతులను మోసం చేసిందని అన్నారు. భూములు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన తమకు న్యాయం కావాలని నిర్వాసితులు నినాదాలు చేశారు. ఢిల్లీలో రెండురోజులు ఉండి అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లను కలిసి తమగోడు వెళ్లబోసుకుంటామన్నారు.