ఉపాధి బిల్లులు చెల్లించాలని నిరసన
ABN , Publish Date - May 29 , 2025 | 11:54 PM
ఉపాధి పనులు చేసి 8 వారాలు కావస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధిహామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
బలిజిపేట, మే 29(ఆంధ్రజ్యోతి): ఉపాధి పనులు చేసి 8 వారాలు కావస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధిహామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం బలిజిపేటలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి బిల్లులు చెల్లించాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి తక్షణమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.