ఎరువుల కొరతపై నిలదీత
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:05 AM
ఖరీఫ్‌లో రైతులకు అవసర మైన ఎరువులు కొరతపై ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. ఉపాధి పథకం సిబ్బంది పనితీరుపై అసంతృప్తివ్యక్తం చేశారు.
గరుగుబిల్లి, ఆగస్టు 26 (ఆంధ్ర జ్యోతి): ఖరీఫ్‌లో రైతులకు అవసర మైన ఎరువులు కొరతపై ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. ఉపాధి పథకం సిబ్బంది పనితీరుపై అసంతృప్తివ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీపీ ఉరిటి రామారావు అధ్యక్షతన గరుగుబిల్లి మండల సర్వసభ్య సమావేశంలో పలుఅంశాలపై వాడివేడి చర్చ జరిగింది. తొలుత నాగూరు ఎంపీటీసీ సత్యనారాయణతో పాటు ఎంపీపీ ఏవో జ్యోత్నను ఎరువులకొరతపై ప్రశ్నించారు.ఏపీవో ఎం.గౌరీనాఽథ్ తీరుతో చెడ్డ పేరు వచ్చిం దని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక తనిఖీబృందం పంచాయతీలో లోపాలను గుర్తిం చిందని, ఏపీవో తీరు వల్ల టీఏ, ఎఫ్‌ఏ, కంప్యూటర్ ఆపరేటర్లకు అపరాధ రుసుము విధించారని, మండలంలో రూ.60 లక్షలు ఉపాధిలో అవినీతి జరిగిందని సభ్యులు పేర్కొన్నారు.ఏపీవో నిర్వాహ కంపై దర్యాప్తు నిర్వహించి నివేదికలు అందించాలని ఎంపీడీవో జి.పైడితల్లి, ఈసీ డి.తేజేశ్వరరా వులను ఎంపీపీ ఆదేశించారు. ఎనిమిది పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయని, అయితే వీటికి స్థల సమస్యనెలకొందని ఆ శాఖ జేఈ జి.గౌరీశంకర్ తెలిపారు. దీంతో తహసీల్దార్ పి.బాల స్పందిస్తూ స్థలం కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు.పలు శాఖల అధికారులు గైర్హాజరుకావ డంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యులు కె.భరత్‌కుమార్, అంబటి రాంబాబు, డిప్యూటీ ఎంపీడీవో ఎల్.గోపాలరావు, ఐసీడీఎస్ పీవో జి.సుగుణకుమారి పాల్గొన్నారు.