Share News

పనిభారం తగ్గించాలంటూ నిరసన

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:33 AM

తమకు పనిభారం తగ్గించాలని గ్రామ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు.

పనిభారం తగ్గించాలంటూ నిరసన
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న కార్యదర్శులు

గరుగుబిల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తమకు పనిభారం తగ్గించాలని గ్రామ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీల్లో ఉదయం 6 గంట లకు విధులకు హాజరుకావడం, చెత్త సేకరణ, పారిశు ధ్యం వంటి పనులు నిర్వహించడం వంటి వాటిపై కొంతమేర అసౌకర్యం నెలకొందన్నారు. సచివాలయాల డీడీవో హోదా తొలగించి పంచాయతీఈ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కార్యదర్శుల సమస్యలపై స్పందించకుంటే ఈనెల 9న పెన్‌డౌన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించ కుంటే 15వ తేదీన శాంతియుత నిరసనలు చేపడతా మని చెప్పారు. ఈ సమస్యలను ఎంపీడీవో జి.పైడితల్లి, డిప్యూటీ ఎంపీడీవో ఎల్‌.గోపాలరావులకు తెలియపర్చారు.

Updated Date - Jul 05 , 2025 | 12:33 AM