Share News

బొడ్డవరలో జిందాల్‌ నిర్వాసితుల నిరసన

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:24 PM

మండలంలోని బొడ్డవరలో ఆదివారం జిందాల్‌ నిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు జిందాల్‌ యాజమాన్యం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుచేసి న్యాయం చేయాలని 43 రోజులుగా నాలుగుపంచాయతీల నిర్వాసితులు నిరసన తెలుపుతున్నారు.

బొడ్డవరలో జిందాల్‌ నిర్వాసితుల నిరసన
మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసనతెలుపుతున్న జిందాల్‌ నిర్వాసితులు:

ఎస్‌.కోట రూరల్‌ ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవరలో ఆదివారం జిందాల్‌ నిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు జిందాల్‌ యాజమాన్యం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుచేసి న్యాయం చేయాలని 43 రోజులుగా నాలుగుపంచాయతీల నిర్వాసితులు నిరసన తెలుపుతున్నారు. ఆదివారం రైతు సంఘ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్‌ ఆధ్వర్యంలో బొడ్డవర వద్ద మెడకు ఉరితాళ్లు తగిలించుకొని నిరసన తెలిపారు. ఈసందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ 18 ఏళ్ల కిందట భూసేకరణచేసి తమ బతుకులు చిన్నాభిన్నం చేశారని, ఇప్పుడు తమను సంప్రదించకుండా వేరే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటున్నారని వాపోయారు. కలెక్టర్‌,ఎమ్మెల్యే చొరవ తీసుకొని కంపెనీతో మాట్లాడి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుచేయాలని కోరారు. తమ భూముల్లో వెంటనే పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి, భద్రత కల్పించాలని కోరారు.

Updated Date - Aug 03 , 2025 | 11:24 PM