ఉపాఽధిహామీ పథకం పేరు మార్పుపై నిరసన
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:29 PM
మహాత్మాగాంధీ పేరుభావితరాలకు తెలియచేయకుండా ఉండడం కోసమే గ్రామీణ ఉపాధిపఽథకానికి గత ప్రభుత్వం పెట్టిన పేరును మారుస్తూ కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లుపెట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆరోపించారు.
కొత్తవలస, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ పేరుభావితరాలకు తెలియచేయకుండా ఉండడం కోసమే గ్రామీణ ఉపాధిపఽథకానికి గత ప్రభుత్వం పెట్టిన పేరును మారుస్తూ కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లుపెట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆరోపించారు.ఈమేరకు గాంధీనగర్‌లోని అంబేడ్కర్ విగ్రహంవద్ద ఉపాధిహామీ పఽథకం వేతనదారులతో కలిసి నిరసన తెలి పారు.పథకం పేరు మారుస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు, పి.రమణమ్మ,కె.కాసులమ్మ,మంగమ్మ, కోటమ్మ, జయ, లక్ష్మి పాల్గొన్నారు.