Share News

Property Tax ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.724 కోట్లు

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:05 AM

Property Tax Collection Target set at ₹724 Crores విశాఖ రీజనల్‌ పరిధిలో పురపాలక సంఘాల నుంచి 2025-26 సంవత్సరానికి ఆస్తి పన్ను లక్ష్యం రూ.724 కోట్లుగా నిర్ణయించామని, ఇప్పటివరకు రూ.270 కోట్లు వసూలైందని రీజనల్‌ డైరెక్టర్‌ (మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌) వి.రవీంద్ర తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని అధికారులతో సమావేశం నిర్వహించారు.

Property Tax    ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.724 కోట్లు
మాట్లాడుతున్న ఆర్డీఎంఏ రవీంద్ర

సాలూరు, ఆగస్టు25(ఆంధ్రజ్యోతి): విశాఖ రీజనల్‌ పరిధిలో పురపాలక సంఘాల నుంచి 2025-26 సంవత్సరానికి ఆస్తి పన్ను లక్ష్యం రూ.724 కోట్లుగా నిర్ణయించామని, ఇప్పటివరకు రూ.270 కోట్లు వసూలైందని రీజనల్‌ డైరెక్టర్‌ (మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌) వి.రవీంద్ర తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పురపాలక సంఘంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. మున్సిపాలిటీ ఆదాయవనరులపై దృష్టిసారించి వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. డంపింగ్‌ యార్డుల నిర్వహణను తరుణీ అసోసియేట్‌కు అప్పగించామన్నారు. త్వరలో వారు క్షేత్రస్థాయిలోకి వచ్చి పనులు చేపడతారని వెల్లడించారు. కోర్టులో కేసులు ఉన్నంతమాత్రాన పన్నుల వసూలు చేయకుండా ఉండరాదని స్పష్టం చేశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ అద్దెలకు సంబంధించి ఎలాంటి రాయితీ లేదన్నారు. మున్సిపల్‌ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ రత్నకుమార్‌, మేనేజర్‌ శివప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:05 AM