Share News

Property Documents గంటలోనే ఆస్తిపత్రాలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:21 AM

Property Documents in Just an Hour రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ శాఖలో వినూత్న మార్పులు చేసింది. ఈ మేరకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను డిజిటలైజేషన్‌ ద్వారా సులభతరం చేసింది. ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌(ఐజీఆర్‌ఎస్‌) ద్వారా ఒక గంటలోపు ఆస్తి పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేసింది.

Property Documents  గంటలోనే ఆస్తిపత్రాలు
గంటలోనే ఆస్తిపత్రాలు అందజేస్తున్న పాలకొండ సబ్‌ రిజిస్ర్టార్‌

పాలకొండ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ శాఖలో వినూత్న మార్పులు చేసింది. ఈ మేరకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను డిజిటలైజేషన్‌ ద్వారా సులభతరం చేసింది. ఇంటిగ్రేటెడ్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌(ఐజీఆర్‌ఎస్‌) ద్వారా ఒక గంటలోపు ఆస్తి పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేసింది. ముందుగా ప్రజలు ఐజీఆర్‌ఎస్‌ పోర్టల్‌ ద్వారా సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలి. స్లాట్‌బుక్‌ చేసిన వారు సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌లో 10-15 నిమిషాల్లో రిజిస్ర్టేషన్‌ పూర్తి చేయొచ్చు. రిజిస్ర్టేషన్‌ పూర్తయిన వెంటనే ఎన్‌కంబ్రెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), రిజిస్టర్డ్‌ డీడ్‌ వంటి పత్రాలు జారీ చేస్తారు. వాస్తవంగా రిజిస్ర్టేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర రెవెన్యూ డేటాబేస్‌తో అనుసంధానం చేశారు. దీనివల్ల డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ జారీ వేగవంతమైంది. ఆధార్‌ ఆధారిత ఈకేవైసీ, డిజిటల్‌ సంతకాలు, రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఫలితంగా ఒక గంటలోపు పత్రాలు అందుతాయి. గతంలో రిజిస్ర్టేషన్‌ పూర్తయిన తర్వాత వారం రోజులకు డాక్యుమెంట్లు చేతికి వచ్చేవి. జిల్లాలో నాలుగు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాల యాలు ఉన్నాయి. పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండలో రోజుకు సరాసరి 37 డాక్యుమెంట్లకు సంబంధించి ముందురోజు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఒక్కో రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 15-20 మధ్య స్లాట్స్‌ బుక్‌ అవుతున్నాయి.

Updated Date - Aug 21 , 2025 | 12:21 AM