Urea సక్రమంగా యూరియా సరఫరా
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:02 AM
Proper Supply of Urea జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా యూరియా, ఎరువులు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశిం చారు. శుక్రవారం వీరఘట్టం రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
వీరఘట్టం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా యూరియా, ఎరువులు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశిం చారు. శుక్రవారం వీరఘట్టం రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. శ్లాట్ బుకింగ్ విధానం, ఎరువుల పంపిణీ ప్రక్రియ పరిశీలించారు. ఎరువుల కోసం రైతులు వేచి ఉండకుండా చూడాలని సూచించారు. జిల్లాలో అన్నదాతలకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులకు ఏ సమస్య ఉన్నా కలెక్టరేట్‌లో ఉన్న కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ సాయి కామేశ్వర రావు, ఏవో సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.