Share News

పదోన్నతులు కల్పించాలి

ABN , Publish Date - May 14 , 2025 | 12:32 AM

ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు సం బంధించిన సర్క్కులర్‌ 1/2019ను వెంటనే అమలు చేయాలని, ఎన్‌ఎం యూ జోనల్‌కార్యదర్శి బీఎస్‌రాములు కోరారు.

   పదోన్నతులు కల్పించాలి
డీపీటీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఎన్‌ఎంయూ నాయకులు

పార్వతీపురంటౌన్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు సం బంధించిన సర్క్కులర్‌ 1/2019ను వెంటనే అమలు చేయాలని, ఎన్‌ఎం యూ జోనల్‌కార్యదర్శి బీఎస్‌రాములు కోరారు. మంగళవారం స్థానిక పార్వ తీపురం మన్యం జిల్లా ప్రజారవాణాధికారి కార్యాలయం వద్ద ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్‌ఎంయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటే శ్వరరావు, శంకరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు కల్పిం చాలన్నారు. ఈహెచ్‌ ఎస్‌ స్థానంలో ఆర్టీసీలో పాత వైద్య విధానాన్ని అమ లు చేయాలని, సర్క్కులర్‌కు విరుద్దంగా ఇప్పటివరకు ఇచ్చిన పనిష్మింట్లను రద్దు చేయాలని కోరారు. ఆర్టీసీ గ్యారేజీతోపాటు ఆన్‌కాల్‌ డ్రైవర్ల సమస్య లను పరిష్కరించాలని తెలిపారు. మహిళాఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులను మంజూరు చేయాలన్నారు. కార్యక్ర మంలో డిపోకార్యదర్శి కేబీ రాజు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:32 AM