హామీలు అమలుచేయాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:41 PM
కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మునిసిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయ కుడు రామ్మూర్తినాయుడు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ విధానం రద్దుచే యాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
రాజాం రూరల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మునిసిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయ కుడు రామ్మూర్తినాయుడు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ విధానం రద్దుచే యాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. మంగళవారం రాజాం మెయిన్‌రోడ్‌లో సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ కార్మికులు ధర్నా నిర్వహించా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడచినా కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల కమిటీ వేసి నెలరోజులు గడచినా నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు.