నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:41 PM
జిందాల్ యాజ మాన్యం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నేరవేర్చి శంకుస్థాపన కార్యక్ర మాలు చేయాలని ఏపీరైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ కోరారు.
ఎస్.కోట రూరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిందాల్ యాజ మాన్యం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నేరవేర్చి శంకుస్థాపన కార్యక్ర మాలు చేయాలని ఏపీరైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ కోరారు. ఆదివారం బొడ్డవరలో 184వరోజు జిందాల్ నిర్వాసితుల నిరసన దీక్షలో వారికి మద్దతుగా పాల్గొన్ని జగన్ మాట్లాడుతూ బొడ్డవరలో 18 ఏళ్ల కిందట జిందాల్ కంపెనీకు భూములు సేకరించారని అప్పుడు భూములు కోల్పోయిన వారికి సదరు సంస్థ యాజమాన్యం ఎన్నో వాగ్దా నాలు లిఖితపూర్వకంగా ఇచ్చి నేడు మోసంచేసిందని ఆరోపించారు.