Share News

లాభదాయక పంటలను సాగు చేయాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:21 AM

రైతులు లాభదాయక పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తెలిపారు.

లాభదాయక పంటలను సాగు చేయాలి
కొండతామారాపల్లిలో టమాటాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌/గంట్యాడ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రైతులు లాభదాయక పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తెలిపారు. గంట్యాడ మండలంలోని కొటారుబిల్లి, కొండతామారాపల్లి గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. వరి, మామిడి, టమాట పంటలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ.. మామిడికి బదులుగా ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తే మేలు ఉంటుందని రైతులకు సూచించారు. వరి నికర ఆదాయం తక్కువగా ఉన్నం దున ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యానికి, పర్యావరణానికి, నేలకు, రైతుకు లాభదాయకమని కలెక్టర్‌ పేర్కొన్నారు. స్థానిక యూత్‌ క్లబ్‌లో ప్రకృతి వ్యవసాయంపై ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్ల శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రైతులు రసాయన ఎరువులు వినియో గం తగ్గించాలన్నారు. భూమిలో సహజ సిద్ధంగా ఉన్న పోషకాలు నష్టపోకుండా, భూసారాన్ని పెంచాలని అన్నారు. సహజ ఎరువులతో పంటలు పండించాలన్నారు. కూరగాయలకు మంచి మార్కెట్‌ ఉందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికా రులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ తారాక రామారావు, ప్రకృతి వ్యవసాయ డీడీ ఆనందరావు, ఏడీ ప్రకాష్‌, తహ సీల్దార్‌ నీలకంఠేశ్వరరెడ్డి, ఎంపీడీవో రమణమూర్తి, ఏడీఏ నాగభూషణ్‌, ఏవో శ్యామ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:21 AM