Procurement of Grain నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:04 AM
Procurement of Grain as per Guidelines నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కోట సీతారాంపురంలో పర్యటించారు. ముందుగా ధాన్యం నూర్పిడి జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి రైౖతులు, సిబ్బందితో మాట్లాడారు. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు.
సీతానగరం, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కోట సీతారాంపురంలో పర్యటించారు. ముందుగా ధాన్యం నూర్పిడి జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి రైౖతులు, సిబ్బందితో మాట్లాడారు. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. రైతుసేవా కేంద్రాల నుంచే గోనె సంచులు, రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రవాణా ఖర్చు అందుతుందా? లేదా! అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద తేమ శాతం ఒకే విధంగా ఉండాలన్నారు. ఈ ప్రాంతం డ్రై ఏరియా కావడంతో రబీలో హార్టీకల్చర్ వైపు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు. తమ పంట పొలాల్లో బోర్లు సరిగ్గా పడటం లేదని, కెనాల్ సౌకర్యం కావాలని కొందరు గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. ఆ ప్రాంతంలో బోర్‌వెల్స్ ఎక్కడెక్కడ పడతాయో సర్వే నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
రైస్ మిల్లుకు షోకాజ్ నోటీసు
సీతానగరం (బలిజిపేట): బలిజిపేట మండలంలో ఓ మోడరన్ రైస్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం తేమ శాతాన్ని సరిచూసే మాయిశ్చర్ టెస్టింగ్ యంత్రాల పనితీరును పరిశీలించారు. అయితే తూనిక యంత్రం సరిగ్గా లేకపోవడం, తూకంలో అవకతవకలకు పాల్పడడంతో రైస్ మిల్లుకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గోనె సంచులు, కలాసీ, రవాణా ఖర్చులు నేరుగా రైతు ఖాతాలో జమ అవుతాయన్నారు. నిబంధనల అమలులో ఎటువంటి అవకతవకలు జరిగినా మండల వ్యవసాయాధికారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ అనంతరం ఆయన వంతరాం గ్రామంలోని కేజీబీవీని సందర్శించారు. వసతి గృహం, కిచెన్ షెడ్‌ను పరిశీలించారు. బాలికలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆహారం నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థినుల హాజరు, స్టాక్ రిజిస్టర్లు, మెనూ అమలును పక్కాగా నిర్వహించాలన్నారు.