Share News

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:22 AM

జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధిలో బాధితుల సమస్య లను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలని అదనపు ఎస్పీ సౌమ్యలత పోలీసు అధికారులను ఆదేశించారు.

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  • పీజీఆర్‌ఎస్‌కు 25 ఫిర్యాదులు

విజయనగరం క్రైం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధిలో బాధితుల సమస్య లను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించాలని అదనపు ఎస్పీ సౌమ్యలత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమ స్యల పరిష్కార వేదిక నిర్వహించి 25 ఫిర్యాదులు స్వీక రించారు. స్వీకరించిన ఫిర్యాదులు భూ తగాదాలకు సం బంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్టు 3, ఇతర అంశాలకు సం బంధించి 10 ఫిర్యాదులు అందాయి. సంబంధిత అధికా రులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని వాటి పూర్వా పరాలు విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవమైన ట్టయితే, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాల యానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఎవీ లీలారావు, కుమారస్వామి, ఎస్‌ఐ ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

మహానీయుడు పొట్టిశ్రీరాములు

భాషాప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం అమరణ నిర హార దీక్ష చేపట్టి అమరజీవిగా నిలిచిన మహానీ యుడు పొట్టి శ్రీరాములు అని అదనపు ఎస్పీ సౌమ్యలత కొనియాడారు. ఎస్పీ దామోదర్‌ ఆదేశాలతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఐ ఎవీ లీలారావు, ఆర్‌ఐ గోపాలనాయుడు, సీఐలు సత్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌, లలిత పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:22 AM