Share News

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

ABN , Publish Date - May 20 , 2025 | 12:33 AM

ప్రజా సమస్య ల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు.

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

  • కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

  • పీజీఆర్‌ఎస్‌కు 108 వినతులు

పార్వతీపురం, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్య ల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివి ధ గ్రామాల నుంచి వచ్చిన వారి నుంచి మొత్తం 108 వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రతి సమస్యను మానవతా దృక్పథంతో పరిశీ లించాలన్నారు. పార్వతీపురం పట్టణానికి చెందిన జి.కిషోర్‌ అనే దివ్యాంగుడు తన తల్లితో కలిసి వినతిప త్రం అందిస్తూ తనకు మూడేళ్ల కిందట పింఛన్‌ నిలిపి వేశారని, పింఛన్‌ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్వతీపురం పట్టణం జగన్నాథ పురానికి చెందిన యువకులు తమకు గ్రంథాలయంతో పాటు పోటీ పరీక్షలకు అవస రమైన పుస్తకాలు అందించాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్ట ర్‌ స్పందించి యువతకు అవస రమైన పుస్తకాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశిం చారు. సాలూరు మండలం గున్న మామిడివలసలో తాగునీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఎం.లోకేష్‌ వినతిపత్రాన్ని అందించారు. ఈ విధంగా వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జేసీ శోభిక, సబ్‌ కలెక్ట ర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో హేమలత, ఉప కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అవుట్‌సోర్సింగ్‌ పోస్టింగ్‌పై వినతి

పాలకొండ: అక్రమ అవుట్‌సోర్సింగ్‌ పోస్టింగ్‌పై పాల కొండ నగర పంచాయతీ పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతిపత్రం అందించారు. ఈ అక్రమమైన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం నిలుపుదల చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను కోరారు. అలాగే ఎన్నో ఏళ్లగా పాలకొండ నగర పంచాయతీకి పట్టిపీడి స్తున్న డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరించి, స్థలా న్ని కేటాయించాలని కలెక్టర్‌కు విన్నవించారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 44 వినతులు

సీతంపేట రూరల్‌: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీసీఆర్‌ఎస్‌కు మొత్తం 44 వినతులు వచ్చాయి. పుబ్బాడ గ్రామంలో సీసీ రహదారి నిర్మించా లని కె.పద్మ కోరారు. కొత్తూరు మండలం రెల్లిగూడ గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని బంగారమ్మ కోరగా రాజమానుగూడ గ్రామంలో వరదగోడ నిర్మించా లని సవర చిన్నారావు కోరారు. కుంబి గ్రామంలో మంచినీటి బోరు ఏర్పాటు చేయాలని కూరంగి రామా రావు, సబ్సిడీపై ట్రాక్టర్‌ ఇప్పించాలని పకీరు, రాయిమా నుగూడ గ్రామంలో సీసీ రహదారి నిర్మించాలని సవర దీపిక, ఉద్యోగవకాశం కల్పించాలని రాజేశ్వరరావు, మెట్టుగూడ గ్రామంలో వీధి కాలువలు నిర్మించాలని ఆరిక సురేష్‌లు పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఇలా అనేక సమస్యలు పరిష్కారం కోరుతూ పీజీఆర్‌ఎస్‌కు వినతులు వచ్చాయి. పీవోతో పాటు డీడీ అన్నదొర, టీడబ్ల్యూ ఈఈ పి.రమాదేవి, పీహెచ్‌వో ఎంవీ గణేష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మధుసూదనరావు, ఐకేపీ ఏపీడీ సన్యాసిరావు, ఏటీడబ్ల్యూవో మంగవేణి పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 12:33 AM