Share News

problem by school bags ఆ బ్యాగులతో అవస్థలే

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:21 AM

problem by school bags ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కింద అందించిన బ్యాగుల్లో నాణ్యత లోపించింది. పంపిణీ చేసిన 45 రోజులకే బ్యాగ్‌లు చిరిగిపోతున్నాయి. దీంతో కొందరు టైలర్‌తో కుట్టుకుని వినియోగించుకోగా మరికొంతమంది పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు.

problem by school bags ఆ బ్యాగులతో అవస్థలే
గంట్యాడ: చిరిగిన బ్యాగులతో విద్యార్థినులు

ఆ బ్యాగులతో అవస్థలే

ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

నాణ్యత లేనివి సరఫరా

45 రోజులకే చిరిగిపోయిన వైనం

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కింద అందించిన బ్యాగుల్లో నాణ్యత లోపించింది. పంపిణీ చేసిన 45 రోజులకే బ్యాగ్‌లు చిరిగిపోతున్నాయి. దీంతో కొందరు టైలర్‌తో కుట్టుకుని వినియోగించుకోగా మరికొంతమంది పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర ద్వారా యూనిఫాం, షూలు, బ్యాగ్‌, నోట్‌ పుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, బెల్ట్‌లు తదితర కిట్లును గత జూన్‌ నెలలో పాఠశాల పునఃప్రారంభించిన వెంటనే పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 1,17,054 మంది విద్యార్థులకు బ్యాగులను అందించారు. మిగిలిన వాటిని పక్కన పెడితే బ్యాగులు మాత్రం నాణ్యత లేవనేది విద్యార్థుల మాట. వాటిలో దాదాపు 12 కేజీల బరువు పెట్టుకోవచ్చు. అయితే అంతకన్నా తక్కువ బరువు పుస్తకాలు ఉంచినా చిరిగిపోతున్నాయని అంటున్నారు. చిన్న క్లాసులకు ఇచ్చిన బ్యాగులు కూడా తొందరగా చిరిగిపోతున్నాయని చెబుతున్నారు. జిప్‌లు వేసే చోట క్లాత్‌ పీచు పీచుగా వదిలేస్తున్నాయి. మరికొన్ని తాళ్లు తెగిపోవడం, ఇంకొన్ని కుట్లు వదిలేయడం జరుగుతోంది. బయట మార్కెట్‌లో కొనలేని పేదలు చిరిగిపోయినా సర్దుకుపోతున్నారు. ఏడాది పాటు ఉండాల్సిన బ్యాగులు 45 రోజులకే మూలకు చేరిన అంశాన్ని జిల్లా సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు రామారావు వద్ద ప్రస్తావించగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేసిన బ్యాగ్‌లు నాణ్యతగా ఉన్నాయని, కొందరు విద్యార్థులు వినియోగించడంలో ఏమైనా సమస్య ఉండొచ్చునని అన్నారు. అయినా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

=========

Updated Date - Aug 05 , 2025 | 12:21 AM