క్రీడలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:58 PM
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.
చీపురుపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. సోమవారం చీపురుపల్లిలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డివిజన్‌స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు రౌతు కామునాయుడు, గవిడి నాగరాజు, పతివాడ శ్రీనివాసరావుపాల్గొన్నారు.