కష్టపడిన వారికి ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:12 AM
పార్టీకోసం కష్టపడిన వారికి ప్రాధా న్యం ఇవ్వనున్నట్లు ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు.
కవిటి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి):పార్టీకోసం కష్టపడిన వారికి ప్రాధా న్యం ఇవ్వనున్నట్లు ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు. పార్టీకి కార్యకర్తలే నాయకులని చెప్పారు. రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి.అశోక్‌తో కలిసి పార్టీ సంస్థాగత ఎన్నికలపై సోమవారం చర్చించారు.ఈసందర్భంగా నియోజకవర్గ ముఖ్యనాయకుల తో మాట్లాడారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలంటే గ్రామస్థాయి నుంచి సంస్థాగత ఎన్నికల్లో యువకులు, మహిళలకు అవకాశం కల్పించా లని బాబురావు కోరారు. గ్రామస్థాయి నుంచి ప్రజాభిప్రాయం తీసుకొని మాత్రమే పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీలను త్వరగా పూర్తిచేయాలని కోరారు.