రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:06 AM
కూటమి ప్రభుత్వంలో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోందనికురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోందనికురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు.మంగళవారం బాతుగుడబ బీటీ రహదారి పునర్నిర్మాణానికి విప్ తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూలిగూడ ప్రధాన రహదారి నుంచి బాతుగుడబ వరకు 70 లక్షలతో 2.3 కిలో మీటర్లు వరకు బీటీరోడ్డు పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీ వో త్రివిక్రమరావు, టీడీపీ మండలాధ్యక్షుడు అడ్డాకుల నరేష్, నిమ్మక సింహాచలం, దాసు, ధర్మారావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
అర్హులైన పింఛన్‌దారులకు న్యాయం చేస్తాం
గరుగుబిల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అర్హులైన దివ్యాంగ పింఛన్‌దారులకు న్యాయం చేస్తామని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి తెలిపారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురంలో కురుపాం మండలంలోని దివ్యాంగ పింఛన్‌దా రులకు న్యాయంచేయాలని, పింఛన్లు పునరుద్ధరించాలని కొప్పల వెలమ కార్పొరే షన్ డైరెక్టర్ ఎ.మధుసూదనరావు, సంతోషపురం సర్పంచ్ రాంబాబు వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో నీటి సంఘం అధ్యక్షులు పి.పాపినాయుడు, సర్పంచ్ జి.అప్పలనాయుడు, యడ్ల శ్రీనివాసరావు, పి.వెంకటరమణ పాల్గొన్నారు.